Sunday, March 20, 2011

సంకల్పం ఎంత గొప్పదో రుజువు చేస్తా
నీకు ఏదో చెప్పాలని కాదు గాని నీ సావాసం
నాలో ఎంతటి మధురానుభూతులను
చిరు ఆనందాలను నింపిందో నీకు తెలుస్తుంది


~To Zarah

Friday, March 18, 2011

Things happened and caused us pain
Let be it a lesson about people who feign
Too many crossroads down the lane
For my love for you will never wane

To think that I ignored you in the past
Is a coincidence of events that won't last
Forgive me for being a part of the cast
Sure will never happen at any cost


Lot of things change in due course of time
But you're the same in my heart, sweet lime
People come and people go in time
Never were you gone nor were sublime

~~~~~~~~~To Zarah

Saturday, March 05, 2011

హృదయాన్ని మరిపించిన నీ సావాసం
మనసుని ఆహ్లాద పరిచిన నీ రూపం
కనువిందు చేసిన నీ కవనం
వీడిపోని నీ బంధం నా లోని ఈ ధైర్యం


~~~~~~~~~~Dedicated to Zarah
వేయి జన్మల బంధం మనది
ఒక జీవిత కాలం సరిపోనిది
వెన్నెల ఉన్నంత వరకు
సూర్యుడు ఉన్నంత వరకు
భూమి ఉన్నంత వరకు
నేనున్నంత వరకు
నీ కోసం వేచి ఉంటా నేస్తమా


~~~~~~~~~~Dedicated to Zarah
గాయ పడ్డ నా హృదయాని
అడగాలని ఉంది ఈ ప్రశ్నని
మరుపు తెలియని నా మనసునుని
వీడిపోయే స్వప్నం కావాలని
ఉండి లేని నీ రూపం
స్మృతుల గాధ కావాలని
నీస్తామా ఎప్పుడు వస్తున్నావే
నా ఎద లోయలలో ఊయలడేందుకు
ఎప్పుడు వస్తున్నావే


~~~~~~~~~~Dedicated to Zarah

Thursday, March 03, 2011

వికసించే పూవులనడుగు
వర్షించే మేఘాన్నడుగు
విరబూసే జాబిలినడుగు
కిలకిలలాడే పక్షులనడుగు
పారాడే శలఏటినడుగు
వీక్షించే కన్నులనడుగు
నాలోని ఈ మౌనాన్నడుగు
నీలోని నా రూపాన్నడుగు

~~~~~~~~~~~~~~~~~~~~~~Dedicated to Zarah

Wednesday, March 02, 2011

వీచే గాలిలో నీ పైట గాలి మధురం
చూచే కన్నులకు నీవు కనువిందు కాదా
నిను తాకలేని ఈ స్పర్శ వ్యర్ధం
నీతో పంచుకోలేని బ్రతుకు దండగ కాదా

భాష లేని ఈ భావానికి రూపం నీవు
ఊహకందని లాస్యానికి ఉదాహరణ నీవు
నాలోని కవి హృదయాన్ని తట్టి లేపావు నీవు
కానీ భగ్న హృదయాన్ని మిగిల్చి పోయావు

కళ్ళతో చూస్తే కనుమరుగై పోయేది
చేతితో తాకితే చేజారి పోయేది
పలకరిస్తే పెదవి దాటి పోయేది
కాదు నాలోని నీ రూపం, కానీ దారేది?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~Dedicated to Zarah