వీచే గాలిలో నీ పైట గాలి మధురం
చూచే కన్నులకు నీవు కనువిందు కాదా
నిను తాకలేని ఈ స్పర్శ వ్యర్ధం
నీతో పంచుకోలేని బ్రతుకు దండగ కాదా
భాష లేని ఈ భావానికి రూపం నీవు
ఊహకందని లాస్యానికి ఉదాహరణ నీవు
నాలోని కవి హృదయాన్ని తట్టి లేపావు నీవు
కానీ భగ్న హృదయాన్ని మిగిల్చి పోయావు
కళ్ళతో చూస్తే కనుమరుగై పోయేది
చేతితో తాకితే చేజారి పోయేది
పలకరిస్తే పెదవి దాటి పోయేది
కాదు నాలోని నీ రూపం, కానీ దారేది?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~Dedicated to Zarah
No comments:
Post a Comment