కనురెప్పల పైన కవిత రాసి నీకు పంపించా
కలల్లోకి జారిపోయిందా కావ్యం, నా భావోద్వేగం
ఇలలో నిలిచే ప్రేమ కావలి మన స్నేహబంధం
కలలోనైనా నీతో బ్రతుకు పంచుకోవాలని వాంఛ
కలలన్ని నిజమవ్వటానికి కావాలి ఇంకో జన్మం
కనురెప్పలు తెరిస్తే తెలుస్తుంది ఈ వర్తమానం
కానీ తెరిచిన నయనం తట్టుకోగలదా ఈ గమనం
~~~~~~~~~~~~~~~ Dedicated to Zarah
No comments:
Post a Comment